అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తలుపుూరులో శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పొలం కోసం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఘర్షణలో తలుపు చెందిన కొండన్న, ఎర్రమ్మకు భార్యాభర్తలకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. మా పొలంలో మేము విత్తనం వేసుకుంటుండగా మాపై వెంకటరాముడు, బయన్న కొడవలితో దాడి చేశారని బాధితురాలు ఎర్రమ్మ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.