కృష్ణ నదికి వరద ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణ జిల్లా కలెక్టర్ డికె బాలాజీ కోరారు. గురువారం మద్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల సమయంలో స్తానిక మచిలీపట్నం కలెక్టరెట్ లొని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డికె బాలాజి మిడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటికే 3.96 లక్షల క్యూసెక్కుల నీటి విడుదలతో మొదటి హెచ్చరిక జారీ చేశామన్నారు. లంక గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. బుడమేరు ప్రాంతంలో వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశామన్నారు.