ఇరగవరం మండలం అయినపర్రు గ్రామ శివారులో పంటచేలలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం మిస్టరీ వీడలేదు. సోమవారం సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే మృతుడు జేబులో నాలుగు సెల్ ఫోన్లు ఉండడం, మృతదేహం కుళ్లిన దశలో లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇరగవరం ఎస్ఐ జానా సతీష్ మంగళవారం ఉదయం 11:30 కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.