కరీంనగర్ పోలీసు కమీషనర్, కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలునందు అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో, బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సైబర్ నేరాలకు గురై, సైబర్ నేరస్థులచే తస్కరించబడిన సొమ్మును తిరిగి బాధితులకు అందించే విషయంపై కమీషనర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. బాధితులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించిన సందర్భాలలో, సైబర్ క్రైమ్ పోలీసులు తస్కరించబడిన సొమ్మును పుట్ హోల్డ్ లో ఉంచుతారని, వాటిని కోర్టుల ద్వారా తిరిగి బాధితులకు అందజేయడానికి కృషి చేయాలని ఆయన సూచించారు.