అనంతపురం జిల్లాలోని 10 ఓపెన్ క్యాటగిరి బార్లు, రెండు గీత కార్మికుల కులాల వారికి కేటాయించిన బార్లకు సంబంధించి లాటరీ నిర్వహణ శనివారం సాయంత్రం నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నాగమద్దాయ నేతృత్వంలో టెండర్ల లాటరీ ప్రక్రియను నిర్వహించారు.