తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయం సమావేశ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి దేశ అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన దివంగత సర్వేపల్లి రాధాకృష్ణన్ నివాళులర్పించారు