మహబూబ్నగర్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాజపూర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. నిన్న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ శ్రీనివాస్ రెడ్డి మంచానపడ్డాడని చేసిన విమర్శలపై మన్నె శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశారని ఆయన విమర్శించారు.