తార్నాకలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు ఆదివారం మధ్యాహ్నం వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతినెల ఆఖరి ఆదివారం ప్రధాని మోదీ మాట్లాడే మన్ బాత్ కార్యక్రమాన్ని ప్రజలందరూ చూడాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మన్ కి బాత్ కార్యక్రమంలో ఎన్నో విషయాలను ప్రస్తావించడం జరిగిందని తెలిపారు.