కడప జిల్లాలో మూడు ప్రాంతాల్లోనే రేపటి నుంచి కొత్త బార్లు ఏర్పాటు కానున్నాయి.ఆదివారం తెలిసిన వివరాల మేరకు కడపలో 8, ప్రొద్దుటూరులో 5, బద్వేల్లో 1 కొత్త బార్లు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలోని మిగతా బార్లను నేటి అర్ధరాత్రి నుంచి క్లోజ్ కానున్నాయి. నూతన బార్ పాలసీ మేరకు జిల్లాలో జనరల్ కేటగిరిలో 27, గీత కులాల కేటగిరీలో 2, మొత్తం 29 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. 14 వాటికే దరఖాస్తులు రాగా వాటిని డ్రా ద్వారా అధికారులు కేటాయించారు.