బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సెప్టెంబర్ 1న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారని, ఆయన పర్యటనను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొవ్వూరులో మంగళవారం సాయంత్రం కోరారు. బిజెపి జిల్లా సమావేశం కొవ్వూరులో అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సోమ వీర్రాజు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రంలో బిజెపి అభివృద్ధి లక్ష్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ పర్యటన జరుగుతుందన్నారు.