వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మట్టి గణపతి విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేయగా వినాయకుడికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడు జిల్లా ప్రజలను అందరిని సుఖ సంతోషాలు,శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసారు.ప్రజలందరూ మట్టి గణపతులను మాత్రమే పూజించాలని, మన పర్యావరణాన్ని కాపాడాలని ఆకాంక్షించారు.