ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలు కల్పించాలని, గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎం అనుబంధ సంఘాల నాయకులు శుక్రవారం యార్డ్ డిప్యూటీ డైరెక్టర్ కల్పనకు వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆదోని యార్డులో గ్రేడింగ్ విధానం వల్ల రైతులకు నష్టం వస్తోందన్నారు. యార్డులో పలు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.