పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గల సరిపల్లి పిన్నచెరువు వద్ద ఆదివారం గణేశ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శాంతియుత వాతావరణంలో విజయవంతంగా పూర్తయింది. west సబ్ డివిజన్ ఏసిపి పృథ్వితేజ స్వయంగా హాజరై నిమజ్జన కార్యక్రమం సజావుగా, నియమ నిబంధనలకు లోబడి సాగేందుకు పర్యవేక్షించారు. ఆయన సూచనల మేరకు పెందుర్తి ఇన్స్పెక్టర్ కె.వి సతీష్ కుమార్ సిబ్బందితో కలిసి భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేశారు.భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విగ్రహాల నిమజ్జనం పూర్తి చేసుకోవడానికి పోలీసులు సమర్థంగా ఏర్పాట్లు చేయడంతో భక్తజనులు సంతోషం వ్యక్తం చేశారు