చాకలిపాలెం లో చిన్నారులు చేపట్టిన ట్రాలీపై గణనాథుల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో శనివారం గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా 30 బుజ్జి గణనాధుల ప్రతిమలను ట్రాలీపై ఊరేగించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాకలిపాలెం నుంచి రాజోలు మండలం సోంపల్లి వరకు సాగిన ఈ ఊరేగింపును తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, నిమజ్జనంలో పాల్గొన్నారు.