ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల నూతన ఎమ్మార్వో గా కృష్ణమోహన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం డీటీలకు ఎమ్మార్వో గా ప్రమోషన్లు కల్పించారు. ప్రమోషన్ లో భాగంగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు మేరకు కృష్ణమోహన్ త్రిపురాంతకం బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన కృష్ణమోహన్ ను కార్యాలయం సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా అభినందించారు.