ఇసుక లారీలతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని వెంకటాపురం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రహదారులపై నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందన్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటివి ప్రమాదాలకు దారితీస్తున్నాయన్నారు. ఇసుక లోడింగ్ కోసం క్వారీలు రోడ్లపైనే లారీలను నిలపడం వల్ల అంబులెన్సులు సైతం సరైన సమయానికి చేరలేని దుస్థితి నెలకొందనీ నేడు ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు తెలిపారు.