డోన్ పట్టణంలోని కృష్ణ లాడ్జి వెనుక భాగంలో ఉన్న కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంటిలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రికల్ స్కూటీకి ఛార్జింగ్ పెట్టిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఎలక్ట్రికల్ స్కూటీ, రెండు సైకిల్స్, టీవీ, ఫ్రిడ్జ్ మంటల్లో కాలిపోయాయి. స్థానికులు మంటలను గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ ఆ ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.