ఎన్డీఏ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ప్రజలందరికీ అందుబాటులో, నాణ్యమైన వైద్యం అందించాలన్నసంకల్పంతో ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతోందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో హాస్పిటల్ చైర్మన్ జి.ఎస్.రావు అధ్యక్షతన నిర్వహించిన ఐఅర్ఐఏ రాష్ట్ర సధస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రసంగించారు. కేంద్రంలో తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యసేవని దీని ద్వారా 55 కోట్ల మంది ప్రజలకు సేవలు అందుతున్నాయన్నారు.