అనంతపురం నగర శివారులోని రాప్తాడు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రాప్తాడుకు చెందిన రమేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గొర్రెలను కాసుకుంటూ జీవనం సాగిస్తున్న ఇతను మధ్యాహ్నం రాప్తాడు నుంచి అంపాపురం కు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా తమ్మినేపల్లి రాప్తాడు గ్రామాల మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.