మక్తల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం 10:30 గం సమయంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మత్స్యశాఖ క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజాం భూస్వాములకు వ్యతిరేకంగా భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాడిన వీరనారి తెలంగాణ ఆడబిడ్డ చాకలి ఐలమ్మ అని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి తరతరాలకు ప్రేరణ అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.