క్రమశిక్షణకు మారుపేరు బీఆర్ఎస్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. క్రమశిక్షణతోనే బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. క్రమశిక్షణను ఉల్లంగించిన వారు ఎంత పెద్ద వారైనా చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు వేసినట్లు చెప్పారు. ఎంతటి వారైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా, మాట్లాడినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.