ఈనెల 10 (బుధవారం) అనంతపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభ జరుగుతుందని ఆ సభకు వెళితేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని వెళ్ళని వారికి పథకాలు రద్దు చేయిస్తామని కంబదూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో దండోరా వేయించారు. తల్లికి వందనం, ఫ్రీ గ్యాస్ వంటి సంక్షేమ పథకాలు వర్తించాలంటే సీఎం సభకు వెళ్లి తీరాల్సిందేనని దండోరా వేయించారు. సభకు వెళ్లకపోతే కచ్చితంగా పథకాలు రద్దు చేయడం జరుగుతుందని దండోరా వేశారు. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.