Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 10, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, సోమశిల జలాశయంలో 74 TMCల నీటిమట్టం దాటితే నీటి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 70.810 TMCల నీటిమట్టం నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెన్న పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని రెవిన్యూ, పోలీసులకు జలాశయ అధికారులు సమాచారం చేరవేశారు. మరి మూడు నాలుగు రోజుల్లో నీటి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.