మంచిర్యాల జిల్లా భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని గురువారం సాయంత్రం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రవి, తిరుపతి ఎన్నిక చేశారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడిగా మల్లేష్, కార్యదర్శిగా మిట్టపల్లి తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యునిగా మనోహర్, జిల్లా ఉపాధ్యక్షులుగా సాయితేజ, గీతాంజలి, అంజలి, సహాయ కార్యదర్శిగా మనిచరణ్, జిల్లా కమిటీ సభ్యులుగా రెహమాన్, రాజేష్, జషుంత్, సాయికుమార్ ఎన్నికయ్యారు.