దేవీపట్నం మండలం శ్రీ గండిపోశమ్మ అమ్మవారి ఆలయ ధర్మదాయ కమిటీ సభ్యలు ప్రమాణస్వీకారం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవి మాట్లాడుతూ.. అత్యంత ప్రసిద్ధి క్షేత్రం అయిన ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నారు. తన వంతు సహకారాన్ని అందజేస్తామన్నారు. చైర్మన్గా శ్రీనివాసరెడ్డి, సభ్యులు పదవి ప్రమాణస్వీకారం చేశారు.