సీపీఐ 28వ రాష్ట్ర మహాసభల సందర్భంగా చలో ఒంగోలు కార్యక్రమానికి ఎర్రసైన్యం తరలి వెళ్లింది. నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, బాలకృష్ణ తదితరుల నేతృత్వంలో బనగానపల్లెలోని పలువురు నాయకులు, కార్యకర్తలు ఒంగోలులో జరుగుతున్న రాష్ట్ర మహాసభలకు తరలి వెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సీపీఐ తన పోరాటాన్ని కొనసాగిస్తోందని నాయకులు వెల్లడించారు.