రాజీ మార్గమే రాజ మార్గమని పరిష్కరించుకోదగిన కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా జడ్జి పి నీరజ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ను కోర్టు సముదాయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సుప్రీం కోర్టు హైకోర్టు ఆదేశాలతో ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని అందువల్ల పరిష్కరించుకోదగిన కేసులలో రాజీ కుదుర్చుకుని కేసులను తీసి వేయించుకోవాలని దీనివల్ల సమయం మరియు డబ్బులు ఆదా అవుతాయని అన్నారు.