గొల్లబుద్ధారం హాస్టల్ వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బిఆర్ఎస్వీ నాయకులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని గొల్ల బుద్ధారం గ్రామంలోని ఎస్టీ వసతి గృహంలో విద్యుత్ షాక్కు గురైన విద్యార్థిని బందపడగల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా శనివారం 3:50 గంటల సమయంలో అక్కడికి వెళ్లి విద్యార్థిని పరామర్శించి ప్రమాదన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి అక్కడే ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ తో వాగ్వివాదం దిగారు ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.