రాయదుర్గం నుండి బెళుగుప్ప వెళుతున్న ఏపిఎస్ ఆర్టీసి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో నక్కలపల్లి వద్ద రోడ్డు పక్కకు వాలిపోయి బస్సు పల్టీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పలువురు ప్రయాణికులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.