గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తెలంగాణ క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు ప్రత్యేకంగా స్మశాన వాటికకు భూకేటాయింపు, చర్చిల నిర్మాణపు అనుమతులు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, క్రైస్తవ మైనార్టీలకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ, తదితర అంశాలపై పాస్టర్లతో చర్చించారు.