గుంటూరు ఆటోనగర్లో ఆదివారం సాయంత్రం ట్రాన్స్ఫార్మర్ పేలింది. దీంతో పక్కనే ఉన్న కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు 9 నుండి 10 కార్లు అగ్నికి దగ్ధం అయినట్లు తెలుస్తుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.