చల్లపల్లిలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా చల్లపల్లి పరిసర గ్రామాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షానికి జన జీవనం స్తంభించింది. ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన, అంతర్గత రహదారులు జలమయంగా మారాయి. సెలవు రోజు కావటంతో విద్యార్థుల కష్టాలు తప్పాయి. వర్షాలకు చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయారు.