Parvathipuram, Parvathipuram Manyam | Aug 23, 2025
అదనపు జడ్జి, ఫస్ట్ క్లాస్ క్లాస్ మేజిస్ట్రేట్ జె. సౌమ్య జోసెఫిన్ శనివారం స్థానిక సబ్ జైల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. జైలులో వసతులను పరిశీలించారు. ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి పరిస్థితులు పట్ల ఆరా తీశారు. నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు. చక్కటి నడవడిక, నైతిక విలువలు వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. జైలు రికార్డులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. జైలు లీగల్ ఎయిడ్ క్లీనిక్‌ను తనిఖీ చేశారు.