తాడిపత్రి మండలం ఆలూరు గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమాదేవి కుమారుడు నవీన్ కుమార్ ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్ కుమార్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రేమ విఫలం కావడంతో పాటు చదువులో వెనకబడి ఉండడం భరించలేక ఇంటిలోనే ఫ్యాన్ ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ సంఘటనపై మృతుడు తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.