రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి అభినందనీయమని ఏపీ మారిటైమ్ బోర్డు అధ్యక్షుడు దామచర్ల సత్య అన్నారు. ఒంగోలులో జరుగుతున్న జిల్లా స్థాయి గురుపూజోత్సవంలో సత్య శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.30వేల కోట్లు వెచ్చించి విద్యారంగాన్ని మంత్రి లోకేశ్ తోడ్పడుతున్నారని తెలిపారు. అలాగే 16 వేలకు పైగా డీఎస్సీ పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు.