కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు.పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు.మంత్రి హోదాలో తొలిసారి గ్రామానికి వచ్చిన ఆయనకు, గ్రామస్తులు స్వాగతం పలికారు.అనంతరం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల ప్రోసిడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అయన 18 మంది లబ్దిదారులకు మంజూరి పత్రాలను అందజేసారు.ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ... కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.