వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగించ్చిందని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని పలు అభివృద్ధి పనులకు సంబంధించి రూ.135 కోట్ల మేర అప్పులు పాలు చేసిందన్నారు. 14వ డివిజన్ జగదీష్ నగర్ పార్క్ వద్ద అదానీ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని శుక్రవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. డివిజన్ కు విచ్చేసిన మంత్రికి స్థానిక ప్రజలు, టిడిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.