ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో జరిగిన సిపిఐ రాష్ట్ర మహాసభలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బిజెపితో కలవద్దని చంద్రబాబుకు ఎంత చెప్పినా అతను మారడంటూ హెచ్చరించారు. కళ్యాణి ఉద్దేశించే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను ఊసరవెల్లి తో పోల్చారు. ఉదయం చేగువేరా అంటాడు మధ్యాహ్నం సనాతన ధర్మం అంటారు సాయంత్రానికి గుడులు పట్టుకుని పోతూ ఉంటాడని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మం అంటే తెలుసా నీకు అంటూ ప్రశ్నించాడు. భర్త చనిపోతే అదే చితిపై భార్యను పెట్టి కాల్చేదే సనాతన ధర్మమని నువ్వు చనిపోతే నీ భార్య కూడా నీ చితిపై ఉంటుందా అంటూ ప్రశ్నించారు.