మైదుకూరు డివిజన్ ఉద్యాన శాఖ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ ఉల్లి పంటను బిందు సేద్యం ద్వారా సాగు చేస్తే రైతులు అధిక దిగుబడితో పాటు మెరుగైన ఆదాయం పొందవచ్చని తెలిపారు.గురువారం ఆయన లింగాలదిన్నె, శెట్టివారిపల్లె, ఎన్.మైదుకూరు గ్రామాల్లో సాగు చేసిన ఉల్లి పంటను పరిశీలించి రైతులకు పలు సూచనలు అందించారు. ఉల్లి నిల్వల కోసం గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం రాయితీ అందజేస్తోందని, రైతులు మరిన్ని వివరాలకు స్థానిక ఉద్యాన శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.