ములుగు-పాలంపేట ప్రధాన రహదారిపై గురువారం ఉదయం కట్టెల లోడుతో వెళ్తున్న లారీ తారు రోడ్డుపై దిగబడింది. ప్రతిరోజు వాహనాలు దిగబడుతున్నాయని ప్రయాణికులు వాపొతున్నారు. బుధవారం ఓ లారీ దిగబడగా అక్కడే ఉన్న అధికారులు దానిని అక్కడి నుంచి తొలగించారు. కాగా నేడు మరోసారి లారీ దిగబడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.