డి.హిరేహాల్ మండలంలోని హిర్దేహాల్ వద్ద అనంతపురం జిల్లా స్పాంజ్ ఐరన్ మ్యానిఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన కళ్యాణ మండపాన్ని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ప్రారంభించారు. గురువారం మద్యాహ్నం అసోసియేషన్ నాయకులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కమ్యునిటి హాల్ ను రిబ్బన్ కట్ చేసి లాంచనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమన్నారాయణ, మార్కెట్ యార్డు చైర్మన్ గొడిశలపల్లి హనుమంతరెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ నాగళ్ళిరాజు, తిమ్మరాజు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.