Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 27, 2025
భూపాలపల్లి కాటారం జాతీయ రహదారి మల్లంపల్లి స్టేజి సమీపంలో బుధవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో బొగ్గు తీసుకెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 వాహనం చేరుకొని డ్రైవర్ను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా బొగ్గును తీసుకెళ్తున్న క్రమంలో అదుపుతప్పి లారీ బోల్తా పడింది. పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.