ఇచ్చాపురం నియోజకవర్గం, కవిటి మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్‌కు రాజపురం నుంచి వేస్తున్న 33 కేవీ పనుల నిమిత్తం శనివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. 11 కేవీ కవిటి టౌన్ లైన్ మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో బుర్రపుట్టుగ, తొత్తిడిపుట్టగ, కవిటీ, కొత్తూరు, గోండ్యాలపుట్టుగ, ప్రగడపుట్టుగ గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగొచ్చని ఆయన తెలిపారు.