ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని నార్నూర్ మండల కేంద్రంలో రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. రెండు రోజుల క్రితం యూరియా కొరత ఉండగా.. శుక్రవారం పంపిణీ జరుగుతుండటంతో వివిధ గ్రామాల రైతులు పీఏసీఎస్ కార్యాలయం వద్ద బారులు తీరారు. క్యూలో మహిళా రైతులు సైతం నిలబడటం గమన్హారం. వారం రోజుల నుంచి యూరియా కోసం ఎదురు చూస్తున్నామంటూ వ్యవసాయదారులు వాపోయారు.