నర్సాపూర్లో యూరియా కోసం బారులు తీరిన రైతులు. వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద నేడు బుధవారం రోజున ఉదయం నుంచి యూరియా కోసం రైతులు బారులు తీరారు. పీఏసీఎస్ వద్దకు యూరియా వచ్చిందనే సమాచారంతో వేకువజామునే రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టారు. సరైన సమయంలో పంటకు యూరియా అందించకపోవడంతో ఈసారి దిగుబడులు తగ్గే అవకాశం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్పందించి సరిపడా యూరియా అందించాలని కోరుతున్నారు.