ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని నలుగురికి గాయాలయ్యాయి అందులో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.