స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు,సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఈ క్షణం నుంచి కృషి చేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు పిలుపునిచ్చారు. సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి,ఎన్నికల్లో మన సత్తాచాటాలని అభ్యర్థుల గెలుపు కోసం ఐకమత్యంతో పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. బుధవారం వారి నివాసంలో నిర్వహించిన జూలూరుపాడు ఏన్కూర్ మండలం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, అందుకు పార్టీ క్యాడర్ సిద్దంగా ఉండాలని కోరారు.