వాంకిడి మండలంలో ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని BJYM రాష్ట్ర అధికార ప్రతినిధి సుచిత్ డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వాంకిడి ఎంపీడీఓ కార్యాలయం వద్ద 3 రోజుల పాటు నిర్వహించిన దీక్షకు మండల అధికారులు స్పందించారు. ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని ఎంపీఓ హామీ ఇవ్వడంతో గురువారం ఉదయం ఆమరణ నిరాహార దీక్షను సుచిత్ విరమించారు.