కడప జిల్లా పులివెందుల పఠనంలో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రుల వద్ద నుంచి తప్పిపోయారు. పట్టణంలోని స్థానిక ముద్దునూరు రోడ్డులోని సంయోగ్యాస్ ఫ్యాక్టరీకి పోవు దారిలో ఇద్దరు మగపిల్లలు రోదిస్తూ స్థానికుల కంట పడ్డారు. అది గమనించిన స్థానికులు వెంటనే పట్టణ పోలీసులకు అప్పగించారు అయితే ఇద్దరు పిల్లలు వారి పేర్లు గాని , తల్లిదండ్రుల పేర్లు గాని చెప్పలేకపోతున్నారు. ఎవరికైనా ఈ పిల్లల ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం తెలపాలని కోరారు.