వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలను ఆదివారం కుప్పంలో కోలాహలంగా ఊరేగించి నిమజ్జనం చేశారు. బొజ్జ గణపయ్యల ఊరేగింపు సందర్భంగా డప్పు, వాయిద్యాలు, కోలాటల మధ్య యువత స్టెప్స్ వేస్తూ ఆనందోత్సవాల మధ్య నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.